తను చస్తే ఆ పద్నాలుగు మంది రావాలంట!
on Sep 18, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజురోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరేంటని బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమైంది. అయితే ఈ వారం ఒక్కొక్కరికి హోస్ట్ నాగార్జున చాలా గట్టిగానే క్లాస్ పీకాడు. అమర్ దీప్ కంటెస్టెంట్స్ ని రారా, పోరా, వినురా అంటూ మర్యాద లేకుండా మాట్లాడటాన్ని ఇప్పటికే ప్రేక్షకులు తీసుకులేకపోతున్నారు. దాని గురించి నాగార్జున మాట్లాడకపోవడం అనుమానాలకు దారితీస్తుంది.
సీజన్-7 మొదలైందే ఉల్టా పల్టా థీమ్ తో.. అంటే సాధారణంగా ప్రతీ సీజన్ లో లాగా ఓటింగ్ లో చివరన ఉండేవాళ్ళని కాకుండా ఈ సారి ఉల్టా పల్టా చేసి.. టాప్ లో ఉండేవారిని ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకున్నారంతా, కానీ ఓటింగ్ ప్రకారం టాప్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. శివాజీ సెకండ్ స్థానంలో ఉన్నాడు. చివరి స్థానంలో షకీల ఉంది. ఇక రతిక మైండ్ గేమ్ పనిచేయకపోగా, కంటెంట్ కోసం నటిస్తోందని ప్రేక్షకులకు ఇప్పటికే అర్థం అయింది. దాంతో తను అయిదవ స్థానానికి పడిపోయింది. ఇక టేస్టీ తేజ ఉన్నాడా లేదా అనిపిస్తుంది. టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారంతా కానీ షకీల ఎలిమిమేట్ అయింది.
షకీల ఎలిమినేషన్ జరిగిన తర్వాత బిబి బజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ గీతు రాయల్ తో జరిగింది. అయితే తాజాగా ఆ ప్రోమో విడుదలైంది. కాగా ఈ ప్రోమోలో షకీల కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసింది. మీరు ఆశ్రమానికి వెళ్ళారనుకున్నారా? బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళారనుకున్నారా? అని గీతు రాయల్ అడుగగా.. ఎక్స్ క్యూజ్ మి అని షకీల అంది. హౌజ్ లో శివాజీ గారి బ్యాచా? లేక సీరియల్ బ్యాచా? అని గీతు రాయల్ అడుగగా.. నేను చెప్పానా అని షకీలా అంది. నేను అడుగుతున్నాని గీతు రాయల్ అనగా.. నువ్వెవరు నన్నడిగేదని షకీల అంది. ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్పమని గీతు రాయల్ అడుగగా.. ప్రిన్స్ యావర్ వెదవ, శోభా శెట్టి మాస్క్ వేసుకుంది. శివాజీ బిగ్ బ్రదర్ లాగా ఉన్నాడని షకీల అంది. రతికని బ్యూటిఫుల్ స్నేక్ అని, తను ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వదని, ఇస్తే దొరికిపోతుందని షకీల అంది. బిగ్ బాస్ హౌజ్ లో షకీల సేఫ్ గేమ్ ఆడుతుందా అని గీతు రాయల్ అడుగగా.. నేను చస్తే ఈ పద్నాలుగు మంది రావాలి. అది నాకు కావాలా అని షకీల అంది. ఇలా ఒక్కో కంటెస్టెంట్ గురించి తన పాయింటాఫ్ లో చెప్పింది షకీల.
Also Read